కరోనా‌: జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ సందేశం విన్నారా?

ముంబై: ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు వ్యాపించిన కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) వ్యాప్తిని చెందిన నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలు కీలక ప్రచారాన్ని చేపట్టాయి.  మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కాల్‌ చేసిననపుడు ఒక అవగాహనా సందేశాన్ని ప్లే చేస్తోంది. కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నివారణకు అనుసరించాల్సిన ముందు  జాగ్రత్త చర్యలతో ఈ సందేశం నిండి వుండటం విశేషం.  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌,  రిలయన్స్‌ జియో వినియోగదారులకు ఫోన్‌ చేసినపుడు  ఈ సందేశాన్ని వినియోగదారులు గమనించవచ్చు.