'ఆ జీవోను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే'

తెలంగాణ: రేవంత్‌రెడ్డి డ్రోన్ కేసుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రేవంత్‌ భూవివాదంపై చట్టప్రకారమే చర్యలు తీసుకన్నామని, వ్యక్తిగతంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ హాల్‌లో నిర్వహించిన చిట్‌‌చాట్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం చేయలేదని, ఎవరో కట్టుకున్న దానిని లీజుకు తీసుకుని ఉంటున్నారని వివరించారు.



111 జీవో తీసివేయాలనే డిమాండ్ ఉందని తెలిపారు. అయితే 111జీవోను పెంచి పోషించింది టీడీపీ- కాంగ్రెస్‌ పార్టీలే అని ఆయన విమర్శించారు. ఇక పద్మారావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదన్నారు. ఆయన గతంలో కంటే చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నాడని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో జనాభాను బట్టి వార్డుల పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి తలసాని పేర్కొన్నారు.