హైదరాబాద్ : నవీకరణ పనుల్లో భాగంగా ఎంజే మార్కెట్ లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఫ్లోరింగ్ పనులు మరో వారం రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే నగరంలో మార్పులు గమనిస్తున్నారా! జంక్షన్లలో జిలుగులు.. సెంట్రల్ డివైడర్లకు రంగులు.. ఐలాండ్లలో వాటర్ ఫౌంటైన్‌లు.. రోడ్లకు లేన్ మార్కింగ్‌లు.. ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్‌ఈడీ వెలుగులు.. పార్కుల్లో ఆకట్టుకునేలా ఫర్నిచర్.. ఇలా ఒకటేమిటి వివిధ ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదంగా, కనువిందుగా సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రానున్న ఏడెనిమిది నెలల్లో ఇవి మరింత విస్తృతం కానున్నాయి.. దాదాపు పది నెలల్లో బల్దియా పాలకమండలి ఎన్నికలు జరగనుండటంతో.. ఈలోగా నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు, సరికొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఇందుకనుగుణంగా మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలునిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పలు ఆదేశాలుజారీ చేస్తూ, బాగున్న వాటిని మరిన్ని పెంచాల్సిందిగా సూచిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఖైరతాబాద్ జంక్షన్ సుందరీకరణ, ఇందిరాపార్కులో పంచతత్వ పార్కు, శేరిలింగంపల్లి జోన్‌లోని ప్లాస్టిక్ ఫుట్‌పాత్‌లు తదితరమైనవి అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. బాగున్నవాటిని సత్వరం చేయా ల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు.
ఎంజే... నిండా వెలుగులే...